బడ్జెట్ స్పీచ్‭ కు ప్రభుత్వ నోట్‭ కు పొంతనేదీ?

బడ్జెట్ స్పీచ్‭ కు  ప్రభుత్వ నోట్‭ కు పొంతనేదీ?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‭లో గందరగోళం ఏర్పడింది.. ఆర్థికమంత్రి బడ్జెట్ స్పీచ్ కు, ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చిన నోట్‭ కు లెక్కల్లో తేడా కనిపిస్తోంది. మొదట బడ్జెట్ స్పీచ్ ‭లో దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉంది. కాని తర్వాత వచ్చిన బడ్జెట్ నోట్‭లో మాత్రం రూ.12,980 కోట్లు కేటాయించినట్లు చూపించారు. రాయదుర్గం ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్‭ ను మూడేళ్లలో రూ.6,250 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. బడ్జెట్‭లో మాత్రం పాత బస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించారు. 

అలాగే సొంత జాగా ఉన్నవాళ్లకు ఇళ్ల నిర్మాణం పై అసలు బడ్జెట్ స్పీచ్ ‭లో ప్రస్తావించనేలేదు. తర్వాత వచ్చిన బడ్జెట్ నోట్ లో ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,980 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక డబుల్ బెడ్ రూం విషయంలోనూ బడ్జెట్‭లో ఏమాత్రం మాట్లాడకుండా నోట్ ‭లో మాత్రం 12వేల కోట్లు కేటాయించినట్లు చూపించారు.