శానిటేషన్ పై మున్సిపల్ సిబ్బంది స్పెషల్ ఫోకస్ పెట్టండి :  అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు

శానిటేషన్ పై మున్సిపల్ సిబ్బంది స్పెషల్ ఫోకస్ పెట్టండి :  అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు

యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు : శానిటేషన్ పై మున్సిపల్ సిబ్బంది స్పెషల్ ఫోకస్ పెట్టాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డుకు ఒక  ఆఫీసర్ ను కేటాయించాలని, పారిశుధ్య, నీటి, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

వార్డ్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మురుగునీటి నిల్వలు లేకుండా పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు.