అశ్వారావుపేటలో 108 బిందెలతో ఆంజనేయ స్వామికి జలాభిషేకం

అశ్వారావుపేటలో 108 బిందెలతో ఆంజనేయ స్వామికి జలాభిషేకం

అశ్వారావుపేట, వెలుగు : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అశ్వారావుపేట పట్టణ శివారులో గల అంకమ్మ చెరువు కట్టపై ఆంజనేయ స్వామికి ఆయకట్టు రైతులు మంగళవారం 108 బిందెలతో జలాభిషేకం చేశారు. 

ప్రతీ ఏడాది స్వామివారికి ఆయకట్టు రైతుల కుటుంబాలు కట్ట పైకి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని చేయడం  ఆనవాయితీగా వస్తుందని రైతులు తెలిపారు.