
దహెగాం, వెలుగు: ఆదివాసీ హక్కుల కోసం పోరాడుదామని రాజ్గోండ్సేవా సమితి గొండ్వానా పంచాయతీ రాయిసెంటర్ జిల్లా కమిటీ సర్మెడీ కుర్సెంగ మోతీరాం పిలుపునిచ్చారు. మంగళవారం దహెగాం మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్మెడీ గా కనక శ్రీనివాస్, ఉప మేడీగా మెట్పల్లి మల్లయ్య,రాయ్ యజమానులుగా కుడ్మెత సుగుణయ్య, గీతేదార్శేగం రాకేశ్, కోశాధికారిగా కనక రమేశ్, ప్రచార కార్యదర్శి కుడ్మెత పుల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా బోయిని శాంత, పొర్యెటి జనార్ధన్, లగ్గాం దామోదర్, తుమ్మిడి సత్యనారాయణ, సిడాం మల్లేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మోతీరాం మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధనకు పోరాడుదామని, సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జాతీయ గొండ్వాన గోండ్ మహాసభ జాతీయ నాయకుడు సిడాం అర్జు, రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడావి గుణవంత్ రావు, ఉపమేడి ఆత్రం లింగరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి మాడావి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.