
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటళ్లు, విద్యాలయాల్లో మంగళవారం డాక్టర్స్ డే నిర్వహించారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ హాస్పిటల్‌లో డాక్టర్ల బృందం, రావు స్కూల్స్ స్టూడెంట్స్‌తో కలిసి ఏవో డాక్టర్ సతీశ్‌కుమార్ కేక్ కట్ చేశారు.
రెనే హాస్పిటల్‌లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ రజనీప్రియదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ హైదరాబాద్ హాస్పిటళ్లలో లభించే అత్యాధునిక వైద్య సేవలు కరీంనగర్‌లో లభించడం గొప్ప విషయమన్నారు. చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల తమ హాస్పిటల్‌లో క్యాన్సర్ పేషంట్స్ కోసం పెట్ సీటీ స్కాన్ ప్రారంభించినట్లు తెలిపారు.
సిటీలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనిటాట్స్‌తోపాటు అల్ఫోర్స్ గర్ల్స్ హైస్కూల్‌లో జాతీయ వైద్యుల, చార్డెడ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఆదర్శనీయమైనదన్నారు. ఆర్థిక రంగంలో సీఏల సేవలు మరవలేనివన్నారు. అనంతరం చిన్నారుల డ్యాన్సులు అలరించాయి.
భగవతి, ఆర్విన్ ట్రీ స్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజానికి వైద్య పరంగా ఎన్నో సేవలు అందించి ఈ మధ్యే కన్నుమూసిన కరీంనగర్ వాసులు డాక్టర్ భూంరెడ్డి, డాక్టర్ సీహెచ్ రవీందర్ రావుకు ఆయన నివాళులు అర్పించారు. వైద్య వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు.