వ్యాక్సిన్ అందరికీ వేయాలా, వద్దా అనే దానిపై కన్ఫ్యూజన్

వ్యాక్సిన్ అందరికీ వేయాలా, వద్దా అనే దానిపై కన్ఫ్యూజన్

పిల్లలు, ప్రెగ్నెంట్లకు ఇప్పుడే వద్దంటున్న డాక్టర్లు

ఇప్పటికే కరోనా వచ్చి పోయినోళ్లు టీకా వేసుకోవద్దంటున్న ఎక్స్​పర్ట్స్​

యాంటీబాడీస్ చాలా తక్కువగా ఉంటేనే తీసుకోవాలని సూచనలు

ముందుగా టీకా వేసుకునేందుకు కరోనా వారియర్లలో భయం

సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే  ఆందోళనలో హెల్త్ స్టాఫ్

ఒకట్రెండు రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్‌ ఇవ్వనున్న కేంద్రం!

హైదరాబాద్‌, వెలుగు: కరోనాకు మందు లేదనే భయం మొన్నటి దాకా.. వ్యాక్సిన్ వస్తోందనే భరోసా నిన్నటి దాకా.. టీకా అందరికీ ఇవ్వాలా వద్దా? అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు..! త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.. మరి వ్యాక్సిన్ ముందు ఎవరికి వేస్తరు? అసలుపెద్ద వాళ్లకు ఇవ్వొచ్చా? వారియర్లకు ఇస్తే మంచిదేనా? కరోనా వచ్చిపోయినోళ్లకు ఇస్తే డేంజరా?.. ఇట్ల ఎన్నో అనుమానాలు..! ఇలాంటి డౌట్లపై డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్టులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్లు ఏం చెబుతున్నారంటే..

పిల్లలకు ఇవ్వొచ్చా?

కరోనా వ్యాక్సిన్ ఎవరైనా వేసుకోవచ్చని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. అయితే పిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా లేనందున వారికి ఇప్పుడే వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మొత్తం జనాభాలో 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకుంటే, మిగిలిన 40 శాతం మందికి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను, ఈ 40 శాతంలోనే ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వకపోవడం మంచిదని చెబుతున్నారు. బ్రిటన్ వంటి కొన్ని దేశాల్లో టీకా ఇవ్వడం ఇప్పటికే స్టార్టయింది. వయసు పైబడిన వారికి, రోగులకు  వ్యాక్సిన్ ఇస్తుండడాన్ని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు.

వారియర్స్‌‌‌‌‌‌‌‌కు మంచిదేనా?

కరోనాపై పోరులో ముందున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అన్ని రకాల హెల్త్ కేర్ వర్కర్లకే తొలి దశలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పీపీఈ కిట్లు, మాస్కులు ఎంత స్ర్టిక్ట్‌‌‌‌‌‌‌‌గా వాడినా చాలా మంది డాక్టర్లు, సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. కొంతమందికి రెండోసారీ కరోనా సోకింది. ఇలా పేషెంట్లతో కలిసి క్రమంగా జనటికల్ మార్పులతో బలపడిన వైరస్ సోకితే ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తొలుత వారియర్స్‌‌‌‌‌‌‌‌కే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.  హెల్త్ స్టాఫ్ మాత్రం వ్యాక్సిన్లు హడావుడిగా తెస్తున్నారని, దీనివల్ల లాంగ్‌‌‌‌‌‌‌‌రన్‌‌‌‌‌‌‌‌లో సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

కరోనా వచ్చిపోయినోళ్లకు సేఫేనా?

ఇప్పటికే ఒకసారి కరోనా వచ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ వచ్చిపోయినోళ్లు టీకా వేసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా వైరస్‌‌‌‌‌‌‌‌ సోకిన వారికి మినహాయింపునిచ్చారు. వైరస్ నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ డెవలప్‌‌‌‌‌‌‌‌ అవుతాయి. ఇవి శరీరంలో 3 నుంచి 6 నెలల దాకా ఉంటాయి. ఆర్నెళ్ల తర్వాత టీ సెల్స్‌‌‌‌‌‌‌‌ లేదా మెమరీ సెల్స్‌‌‌‌‌‌‌‌ మనకు వైరస్ నుంచి రక్షణ ఇస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒకే తరహా వైరస్ మళ్లీ ఎంటరైతే వాటిపై పోరాడే మెకానిజాన్ని ఈ టీసెల్స్ గుర్తు చేస్తాయని, సదరు వైరస్​పై ఎటాక్ చేస్తాయని వివరిస్తున్నారు. కొంతమందికి కరోనా రెండోసారి, మూడోసారీ సోకుతోంది. ఇమ్యునిటీ లెవల్స్ తక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతోందని, ఇలాంటి వాళ్లు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఇలాంటి వారు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నెగెటివ్ రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీస్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉత్పత్తి అయ్యి, సైటోకైన్ స్టార్మ్‌‌‌‌‌‌‌‌ ఏర్పడే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దీంతో లంగ్స్‌‌‌‌‌‌‌‌లో బ్లాక్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పడే ముప్పు ఉంటుందని చెబుతున్నారు.

పెద్ద వాళ్లకు ఎట్ల?

హెల్త్ వర్కర్ల తర్వాత వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా మృతుల్లో 60 శాతం వృద్ధులు, ఇతర రోగాలున్న వారే ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో వీరికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వీరికి ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల వ్యాక్సిన్ నెగెటివ్ రియాక్షన్లూ త్వరగా తెలుస్తాయి. కాబట్టి చివరి దశ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో ఈ కేటగిరీల వారినే వాలంటీర్లుగా ఎంపిక చేసుకుని ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్ల కంటే వీరికే వ్యాక్సిన్ అవసరం ఎక్కువుంది. దీంతో పెద్దలు, రోగాలున్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనని అభిప్రాయం
వ్యక్తమవుతోంది.

ఒకట్రెండు రోజుల్లో గైడ్​లైన్స్

వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ఒకట్రెండు రోజుల్లో కేంద్ర సర్కార్ విడుదల చేయనుంది. వ్యాక్సిన్ ఎవరికి వేయాలి.. ఎవరిని మినహాయించాలి.. వ్యాక్సిన్ వేసిన తర్వాత రియాక్షన్స్ వస్తే ఏంచేయాలి వంటి అనేక అంశాలపై అందులో క్లారిటీ ఇవ్వనుంది.

మన స్టేట్‌‌‌‌‌‌‌‌లో 80 లక్షల మందికి

ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్ల నుంచి అటెండర్ల దాకా అందరి డేటాను రాష్ర్ట ఆరోగ్యశాఖ సేకరించింది. వీళ్లు మొత్తం 2.75 లక్షల మంది ఉన్నారు. కేంద్రం వ్యాక్సిన్ పంపగానే తొలుత వీరికే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తర్వాత శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, ఇతర డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో పనిచేస్తున్నవారికి టీకా ఇవ్వాలని భావిస్తున్నారు. థర్డ్‌‌‌‌‌‌‌‌, ఫోర్త్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 50 ఏండ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ నాలుగు దశల్లోనే సుమారు 80 లక్షల మంది కవర్ అవుతారని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. హెల్త్ ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం మేరకు వీరికి సరిపడా కేంద్రం ఒకేసారి 1.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు రాష్ర్టానికి పంపించే అవకాశం ఉంది.

అవసరాన్ని బట్టి పిల్లలకు..

వయసుతో సంబంధం లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ చివరి దశ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ ఫలితాలు పూర్తిగా రాకుండా, అత్యవసర వినియోగం కోసం వ్యాక్సిన్లు యూజ్ చేస్తున్నప్పుడు పిల్లలను మినహాయించడం మంచిది. లాంగ్‌ టర్మ్‌ లో రియాక్షన్స్ చూసిన తర్వాత, అవసరాన్ని బట్టి పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చు.

– తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్న ఓ మెడికల్ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌

ఇంకొంత టైమ్ ఇవ్వాలె

చాలా మందిలో వ్యాక్సిన్లపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చివరి దశ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో ఉండగానే యూజ్ చేయడమే ఇందుకు కారణం కావచ్చు. ఒకట్రెండు నెలలు టైమిస్తే వ్యాక్సిన్ల సేఫ్టీ ఎంతో తెలుస్తుంది. మన దగ్గరా కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ తగ్గింది. ప్రమాదకర పరిస్థితులు లేనందున ఒకట్రెండు నెలలు గడువు ఇవ్వడం కష్టం కాదు. – ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్ కిరణ్‌‌‌‌‌‌‌‌ మాదాల, నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ

యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ చేసుకోవాలె

వైరస్ వచ్చి తగ్గినవారు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. ఎక్కువ యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తయి మన కణాలు మన శరీరంపైనే దాడి చేస్తాయి. దీని వల్ల లంగ్స్‌‌‌‌‌‌‌‌,  ఆర్గాన్స్ పాడయ్యే ప్రమాదం ఉంది. కరోనా వచ్చి తగ్గినోళ్లు యాంటీబా డీస్ టెస్ట్ చేయించుకొని తక్కువుంటే తీసుకోవాలి.– డాక్టర్ మధుమోహన్‌‌‌‌‌‌‌‌రావు, రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ హెవోడీ, నిమ్స్‌‌‌‌‌‌‌