రాఫెల్‌పై ప్రశ్నలకు బదులివ్వండి: రాహుల్ గాంధీ

రాఫెల్‌పై ప్రశ్నలకు బదులివ్వండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ జెట్స్‌ బుధవారం ఇండియాకు చేరుకున్నాయి. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ సంస్కృతంలో ట్వీట్ చేశారు. తాజాగా ఈ విషయంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్​)కు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో మోడీ సర్కార్‌‌కు రాహుల్‌ కొన్ని ప్రశ్నలు సంధించారు.

‘రాఫెల్‌ విషయంలో ఐఏఎఫ్‌కు కంగ్రాట్స్‌. వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమాధానం చెబుతుందా: ప్రతి ఎయిర్‌‌క్రాఫ్ట్‌ కొనుగోలుకు రూ.526 కోట్లు కాకుండా రూ.1,670 కోట్లు ఖర్చు ఎందుకు చేశారు?, 126 ఎయిర్‌‌క్రాఫ్ట్‌లకు బదులు కేవలం 36 జెట్స్‌నే ఎందుకు కొన్నారు?, హెచ్ఏఎల్‌కు బదులుగా దివాళా తీసిన అనిల్‌కు రూ.30 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను ఎందుకిచ్చారు?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల క్యాంపెయినింగ్‌లో సంధించిన ప్రశ్నల మాదిరి రాఫెల్‌ డీల్‌పై మరోమారు కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు.