ధాన్యం కొనుగోళ్లను అడ్డు కునేందుకు కుట్రలు...చెన్నూర్ బీఆర్ఎస్ నేతల పై కాంగ్రెస్ లీడర్ల ఫైర్

ధాన్యం కొనుగోళ్లను అడ్డు కునేందుకు కుట్రలు...చెన్నూర్ బీఆర్ఎస్ నేతల పై కాంగ్రెస్ లీడర్ల ఫైర్
  •     మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణలను విమర్శిస్తే ఖబడ్డార్​ 

చెన్నూర్, వెలుగు: చెన్నూర్​నియోజకవర్గంలో సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను అడ్డుకొని మంత్రి వివేక్​వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణను బద్నామ్ చేసేందుకు బీఆర్ఎస్​నాయకులు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్​లీడర్లు మండిపడ్డారు. కాంగ్రెస్​నేతలు ఆదివారం సాయంత్రం చెన్నూర్​ మార్కెట్​ యార్డును సందర్శించి వడ్ల అన్​లోడింగ్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు వడ్ల కొనుగోళ్లు సరిగా సాగడం లేదంటూ చేసిన ఆరోపణలను ఖండించారు. మంత్రి వివేక్​చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో బస్తాకు ఐదు కిలోలు కటింగ్​పెట్టి రైతులను దోచుకున్నారని ఫైర్​అయ్యారు. 

నాడు మార్కెట్​కమిటీ చైర్మన్​గా ఉన్న మూల రాజిరెడ్డి పత్తి యార్డులో మంటలు పెట్టి రూ.కోట్ల స్కామ్​లు చేశాడని.. అలాంటి వ్యక్తి మంత్రి, ఎంపీలను విమర్శించడమా అని మండిపడ్డారు. చెన్నూర్​ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి, ఎంపీల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మార్కెట్​కమిటీ చైర్మన్​మహేశ్​ తివారి, మున్సిపల్​వైస్​చైర్​పర్సన్ వినయ్​కుమార్​, మాజీ జడ్పీటీసీ కరుణసాగర్​రావు, లీడర్లు​హిమవంతరెడ్డి, పెద్దింటి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్​పర్సన్ నవాజుద్దీన్, చెన్నూర్​మాజీ సర్పంచ్​కృష్ణ, బ్లాక్​కాంగ్రెస్​ప్రెసిడెంట్​రాజమల్లగౌడ్, చెన్నూర్​మండల కాంగ్రెస్​ప్రెసిడెంట్ బాపగౌడ్, కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు 

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ గురించి పరుష పదజాలంతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్ పై పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేశారు.