
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్ రాజస్థాన్ వైపు చూస్తోంది. రాజస్థాన్ బీజేపీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు మదన్లాల్సైనీ మరణంతో ఖాళీ అయిన సీటుకు మన్మోహన్ను పోటీచేయించాలని భావిస్తోంది. ఇందుకు డీఎంకే నిరాకరించింది.. అస్సాం, గుజరాత్ నుంచీ కుదరకపోవడంతో రాజస్థాన్ వైపు నేతలు దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని, త్వరలో ఎన్నికలు జరగబోయే రాజ్యసభ సీటును కూడా గెల్చుకుంటామని పేర్కొన్నాయి.