రాహుల్..స్మృతీ..ఓ అమేథీ

రాహుల్..స్మృతీ..ఓ అమేథీ

అమేథీ దశాబ్దా లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అమేథీలో వేడి రాజుకుంటోంది. రాహుల్ కు షాక్ ఇవ్వాలని కమలదళం వ్యూహాలు సిద్ధం చేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో నూ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. 28 ఏళ్లు.. గాంధీ ఫ్యామిలీనే1967లో అమేథీ లోక్ సభ సెగ్మెంట్ ఏర్పాటైంది. 44 ఏళ్ల పాటు అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీనే ప్రాతినిధ్యం వహించింది. ఇందులో 28 ఏళ్లు గాంధీ ఫ్యామిలీ వాళ్లే లోక్ సభకు వెళ్లారు. అయితే ఈసారి అమేథీలో రాహుల్ ను ఓడించి.. కాంగ్రెస్ తలెత్తు కోలేకుండా చేయాలని ప్లాన్ లు వేస్తోంది బీజేపీ. రాహుల్ పై మరోసారి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీనే బరిలోకి దించాలని, అది మంచి ఫలితం ఇస్తుందని అంచనా వేస్తోంది.

2014లో రాహుల్ పై పోటీ చేసిన స్మృతీ గట్టిపోటీ ఇచ్చింది. 2009 ఎన్నికల్లో రాహుల్ కు 3,70,198 ఓట్ల మెజారిటీ వస్తే.. 2014లో అది 1,07,903 ఓట్లకు తగ్గిపోయింది. దీంతో స్మృతీ బరిలోకి దిగితే రిజల్ట్​ తమకు పాజిటివ్ గా వస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది. ప్లా న్ ప్రకారం ముందుకు 2015 నుంచి స్మృతీ ఇరానీ ప్రతి నెలలో కనీసం మూడు రోజులు అమేథీలో గడుపుతూ 2019 ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అక్కడి కార్యకర్తల్లో  జోష్ నింపుతూ ముందుకెళుతున్నా రు. ఈ నెలలోనే ప్రధాని మోడీ అమేథీలో ఏకే–203 రైఫిళ్ల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా స్మృతీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని సంకే తాలిచ్చా రు.  అమేథీ సీటును నేరుగా పర్యవేక్షిస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా.. స్మృతీ గెలుపునకు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సూచించారు. ఇక ఐదు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే

అమేథీ చేరుకుని ప్రజలను స్మృతీకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నా రు. సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా పార్టీ చీఫ్ విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అమేథీలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కు రాహుల్ సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహిస్తున్నా రు. అమేథీనితాను చూసుకుంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపునకు రాహుల్ కృషి చేసేలా ఆమె సహకరిస్తోంది. ఇక రాహుల్ విజయానికి కృషి చేసేందుకు తమ రాష్ట్రా ల నుంచి మూడు వేల మంది కార్యకర్తలను అమేథీ పంపేం దుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లా ట్, కమల్ నాథ్ సిద్ధమయ్యారు. మొత్తంగా అమేథీలో ఈసారి టఫ్ ఫైట్ తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.