
హైదరాబాద్ లో బోనాల పండుగలో ఉద్రిక్తత నెలకొంది. అల్వాల్ లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ,బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. చెక్కులు పంపిణీ చేస్తుండగా మైనంపల్లి హనుమంతరావు,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు కల్గజేసుకు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.
ALSO READ : టీ పీసీసీ చీఫ్ మహేశ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ
ఆషాడ మాసం బోనాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఇంటిల్లిపాది అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే లష్కర్ బోనాలు, గోల్కొండ బోనాలు ముగిసాయి.