
మెదక్, వెలుగు: మెదక్, హవేలీఘనపూర్ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పర్యటించారు. వరదకు కొట్టుకుపోయిన మెదక్ - మక్త భూపతి పూర్ రూట్లోని పుష్ఫాల వాగు బ్రిడ్జిని, శమ్నాపూర్ దగ్గర కుంగిన రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు.
ఆయా చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టేలా చూస్తామన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు చంద్రపాల్, శ్రీనివాస్ చౌదరి, వెంకట రమణ, శంకర్, బొజ్జ పవన్, రమేష్, అశోక్, హఫీజ్ ఉన్నారు.
రైతులను ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ మండలం రాయన్ పల్లి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. పుష్పల వాగుపై నిర్మించిన ధోనే, పిల్లర్లు కొట్టుకుపోయాయని దీంతో 7 గ్రామాలకు సంబంధించిన ఆయకట్టు పొలాలకు నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడిందన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె వెంట లావణ్య రెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, రవీందర్ ఉన్నారు.