కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణ, మండలాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్లను డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. మందమర్రి మండల(రూరల్) ప్రెసిడెంట్‌గా కడారి జీవన్‌కుమార్, టౌన్ప్రెసిడెంట్గామండ తిరుమల్‌రెడ్డి, క్యాతనపల్లి టౌన్ ప్రెసిడెంట్‌గా ఒడ్నాల శ్రీనివాస్, జైపూర్మండలాధ్యక్షుడిగా విశ్వంభర్‌రెడ్డి, భీమారం అధ్యక్షుడిగా పొడేటి రవి, కోటపల్లి మండల అధ్యక్షుడిగా కాటరం మల్లయ్యను ఎన్నుకున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ఆదేశాలతో ఈ నియామకం చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ సూచించారు.
