V6 News

జైపూర్, భీమారం సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన : డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి

జైపూర్, భీమారం సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన : డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి

జైపూర్(భీమారం), వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భీమారం మండలంలోని 10 గ్రామపంచాయతీల్లో జరగబోయే ఎన్నికలకు తొమ్మిందిటిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సోమవారం ప్రకటించారు. సాయంత్రం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

భీమారం పంచాయతీ అభ్యర్థిగా అలకాటి భాగ్యలక్ష్మి, బూరుగుపల్లికి మాడే మల్లేశ్, ధర్మారానికి దాసరి సంపత్, దాంపూర్​కు గుండ స్వప్న, ఎల్కేశ్వరానికి బోయిరి జయ, కాజిపల్లికి ప్యాగ లక్ష్మి, కొత్తపల్లికి అనమల్ల అశోక్, మద్దికల్​కు పొతెం సమ్మయ్య, నర్సింగాపూర్​కు పెద్దల రూప పేర్లను ప్రకటించారు. ఆరేపల్లి సర్పంచ్ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. జైపూర్ మండలంలోని 20 గ్రామపంచాయతీలకు 16 గ్రామాలకు పేర్లను ప్రకటించారు.

జైపూర్​కు బెజ్జాల వేముల స్రవంతి, మండలంలోని ఎల్కంటికి గుడేల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగిపల్లికి సుందిళ్ల రాజేశ్వరి, జైపూర్ కు కూన భాస్కర్, కానుకూరుకు పళ్ల చిలుక, కిష్టాపూర్​కు దుర్గం మహేశ్, ముదిగుంటకు బత్తుల సుజాత, నర్సింగాపూర్ కు పండుగ రాజన్న, నర్వకు ఆగిడి స్రవంతి, పెగడపల్లికి రామగిరి నరేశ్, పౌనూర్​కు తుమ్మల లక్ష్మి,షెట్​పల్లికి జాగేటి సరస్వతి, శివ్వారానికి అంజయ్య గౌడ్, టేకుమట్లకు బల్ల వెంకటేశ్, వేలాలకు డేగ స్వప్న పేర్లను ప్రకటించారు. రామారావు పేట, ఇందారం, కుందారం, మిట్టపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల పేర్లను  ప్రకటించలేదు.

మందమర్రి మండల సర్పంచ్ అభ్యర్థుల ఖరారు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం పరిధిలోని 10 పంచాయతీలకు గాను ఏడు స్థానాల్లో కాంగ్రెస్​ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థుల జాబితాను డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి ప్రకటించారు.

ఆదిల్​పేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల అంజయ్య, ఆందుగులపేటకు ముత్యం రమారాజేశ్, బొక్కలగుట్ట పంచాయతీకి మాసు శ్రీనివాస్, మామిడిగట్టుకు గజ్జె భాను, పులిమడుగుకు  ధరావత్ నందిని వినోద్, సారంగపల్లికి ఆసంపల్లి రాజయ్య, శంకర్​పల్లి పంచాయతీ అభ్యర్థిగా మేసినేని మేఘన పేర్లను ప్రకటించారు. కాగా మండలంలోని చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్​పంచాయతీల అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు.