బీసీలకు కాంగ్రెస్‌‌ వెన్నుపోటు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బీసీలకు కాంగ్రెస్‌‌ వెన్నుపోటు : మాజీ మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్

​​​​​హైదరాబాద్‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌ ప్రభుత్వం బీసీలను దారుణంగా మోసం చేస్తోందని, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఓసీలకే కేటాయించి బీసీలకు వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌యాదవ్‌‌ మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.  కామారెడ్డి డిక్లరేషన్‌‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. టికెట్ల కేటాయింపులో ఒక్క బీసీ గ్రాడ్యుయేట్‌‌కు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై పీసీసీ చీఫ్​ మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్‌‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్‌‌ దాసోజు శ్రవణ్‌‌ మాట్లాడుతూ.. రాహుల్‌‌గాంధీ భారత్‌‌ జోడో యాత్రలో బీసీలపై నీతులు చెప్పి, రాష్ట్రంలో మాత్రం వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.