
కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30న తలపెట్టిన ‘భారత్ బచావో ర్యాలీ’ వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల జరుగుతున్న కారణంగా ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్ తెలిపారు. ఈ ర్యాలీని మళ్లీ డిసెంబర్ 14న నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు బీజేపీకి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నామని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక పాలసీలు మరియు ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ ర్యాలీని చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ‘భారత్ బచావో ర్యాలీ’ పేరుతో ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నామని ఆయన తెలిపారు.