బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది

బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది

కర్ణాటకలో బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మాండ్యా జిల్లాలోని బెల్లూరులో రాహుల్ యాత్ర కొనసాగించారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు.

పాదయాత్రలో రాహుల్ వెంట.. హత్యకు గురైన జర్నలిస్టు గౌరీలంకేశ్ తల్లి ఇందిరా లంకేశ్, సోదరి కవితా లంకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొన్నారు. పేసీఎం, పేఈశ్వరప్ప అంటూ ముద్రించిన టీ షర్ట్స్ వేసుకోవడంతో వివాదాస్పదమైంది. టీషర్ట్స్ ధరించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.