
టీఎస్పీఎస్సీ గౄప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ..విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్ ఉద్యోగాలను బజారులో వేలం వేసి అమ్ముతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం సకల జనులు పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇ చేతకాని ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని దుయ్యబట్టారు. బాధ్యత గల మంత్రి కేటీఆర్ తన స్వలాభం కోసం ఓ ప్రైవేటు కంపెనీకి నియామకాల భర్తీ ప్రక్రియను అప్పజెప్పి ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమయ్యాడని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. వెంటనే కేటీఆర్ ను తెలంగాణ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.