హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పిటిషన్

హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు :  జుబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తన మద్దతుదారులను ఎల్లారెడ్డిగూడకు చెందిన తన్నూఖాన్ బెదిరిస్తున్నాడని కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అండతోనే అతను ఇలా ప్రవర్తిస్తున్నాడని తన పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఫిర్యాదు చేసినా  పోలీసులు, ఎన్నికల సంఘం స్పందించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ మద్దతుదారులు మిర్ వాజైహుద్దీన్ అలియాస్ అలీ, డి.రాజ తదితరులను తన్నూఖాన్ ఈ నెల 24న అంతు చూస్తానని  బెదిరించినట్లు తెలిపారు. ఎన్నికలు అయ్యే వరకు తన్నూఖాన్​ను తెలంగాణలో లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.