కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో సోదాలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన లీడర్లు

కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో సోదాలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన లీడర్లు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్ లోని సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్, ఐటీ సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సంపత్ కుమార్ లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు గురయ్యారు. 

ఇంట్లో ఎవరు లేని సమయంలో.. మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.