న్యూఢిల్లీ: బీజేపీ అపోజిషన్గా ఉన్నప్పుడే పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2009 నుంచి 2014 వరకు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందని, ఆ టైమ్‌లోనే పార్లమెంట్ ప్రోసీడింగ్స్‌కు తీవ్ర అంతరాయాలు కలిగాయన్నారు. ఇది తాను చెప్పడం లేదని, డేటా తెలియజేస్తున్నదని చెప్పారు. సభలకు ప్రతిపక్షాలు సహకరించడం లేవన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఖర్గే తీవ్రంగా స్పందించారు.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. పార్లమెంట్లో రచ్చ చేసేది ఆ పార్టీ సభ్యులే అని విమర్శించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఉభయ సభల నుంచి 146 మంది అపోజిషన్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసి.. మూడు రోజుల్లో 14 బిల్లులను బీజేపీ పాస్ చేయించుకుందన్నారు. ప్రస్తుత లోక్‌సభలో 172 బిల్లుల్లోంచి 64 బిల్లులు పాస్ చేయించుకుందని తెలిపారు. వీటిపై ప్రతిపక్షాలతో గంట పాటు కూడా చర్చించలేదన్నారు.
రాజ్యసభలోనూ చర్చకు అవకాశం ఇవ్వకుండా 61 బిల్లులు పాస్ చేయించుకుందని మండిపడ్డారు. కాగా, ప్రస్తుత లోక్‌సభ ముగియడానికి వచ్చినా.. డిప్యూటీ స్పీకర్‌గా ఎవరినీ నియమించలేదన్నారు. ప్రతిపక్ష సభ్యుడికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. తమ గొంతు ఎలా నొక్కేస్తున్నదో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మోదీ మొదటి హయాంలో 179 బిల్లులకు, రెండో సారి 213 బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించిందన్నారు. బీజేపీ సభకు అంతరాయం కలిగించినప్పటికీ యూపీఏ 1లో 297 బిల్లులు, యూపీఏ 2లో