- మెడలు పట్టి గెంటేసినా పార్టీకి ఎంపీ రఘునందన్ మద్దతు
- కౌన్సిలర్ల సన్మానంలో నీలం మధు
అమీన్ పూర్ (పటాన్ చెరు), వెలుగు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ దేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు కుమ్మక్కై రాజకీయాలకు తెర లేపారని ఆరోపించారు. ఎంపీ రఘునందన్ మెడలు పట్టి బయటకు గెంటిన పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు వేయడం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామన్నారు.
ఓటమితో కలత చెంది కుంగిపోయే మనస్తత్వం తనది కాదని, మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం, కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన ప్రజలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
