కొడంగల్, వెలుగు: తొలి దశ సర్పంచ్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసిందని టీపీసీసీ మెంబర్ యూసుఫ్, మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొత్త సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు చేసిన ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. కొడంగల్ అభివృద్ధికి సీఎం రూ.12 వేల కోట్లు మంజూరు చేశారని, ఇంకా అవసరమైతే ఇస్తామన్నారన్నారు.
త్వరలో సిమెంట్ కంపెనీ, అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పారు. అవినీతి, -అక్రమాలకు పాల్పడితే సర్పంచ్‌లపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్ రెడ్డి, శంకర్ నాయక్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.

