పెనుబల్లి, వెలుగు : గ్రామాల్లో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. ఆదివారం పెనుబల్లి మండలం పాత కారాయి గూడెం గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదేండ్లలో రాష్ట్రం లో పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కొన్ని లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పేదల కడుపు నింపేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం అందచేస్తున్నామని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, మండల పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరావు, ఎఎంసీ చైర్మన్ భాగం నీరజ, వంకాయలపాటి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
