రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జిల్లా కమిటీలు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జిల్లా కమిటీలు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​పార్టీలో పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. రెండు, మూడు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల ఇన్ చార్జులు, డీసీసీ అధ్యక్షులతో వన్ టు వన్ చర్చించారు.

 ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్ లు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్​చార్జ్ ల సమావేశాలు నిర్వహించారు. అందరూ నాయకుల ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీలను కూర్పు చేయనున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి ఫైనల్ గా కమిటీల ఎంపికపై చర్చించనున్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కమిటీలపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.