కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు: కేరళ మాజీ సీఎం రమేష్ చెన్నితాల

కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు: కేరళ మాజీ సీఎం రమేష్ చెన్నితాల

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసింది.  తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేరళ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ రమేష్ చెన్నితాల ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రసలు విసిగి పోయారన్నారు.  తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యంగా పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం  ఎదురు చూస్తున్నారన్నారు.  కేసీఆర్ హయంలో కుంభకోణాలు తప్ప అభివృద్ది జరుగలేదన్నారు. 

ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో లక్షల కోట్లు దండుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల  అన్నారు.  తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మడం లేదన్నారు. ఆ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలన్నారు.   తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కేరళ మాజీ ముఖ్యమంత్రి రమేష్ చెన్నితాల  తెలిపారు.