ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు

ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.  ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగించేందుకు పోటీ పడి ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు హైదరాబాద్ లో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు ఢిల్లీలో దీక్ష చేస్తుంటే.. పంట పొలాల దగ్గర  రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై పడి కొట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ విషయంలో  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సుమోటోగా జోక్యం చేసుకుని రైతుల పంటను కొనేలా చూడాలని కోరారు. రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎవరూ అదైర్య పడొద్దని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

బరిలోకి కేజీఎఫ్.. తప్పుకున్న హిందీ మూవీ

కంప్లైంట్ ఇచ్చిన సారే.. బ్రిడ్జి దొంగ

శోభాయాత్రలో వాటర్ బాటిళ్లు పంచిన ముస్లిం యువత