హుస్నాబాద్, వెలుగు : గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని క్యాంప్ ఆఫీసులో మీడియా మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామాలను సాకారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కరీంనగర్ -– -జనగామ ఫోర్ లేన్ రోడ్డు, 250 పడకల హాస్పిటల్, ఎల్లమ్మ చెరువు, మహాసముద్రం గండి, సర్వాయి పాపన్న కోట అభివృద్ధి, గౌరవెల్లి ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని ప్రపోజల్ సిద్ధం చేసి సీఎంకు అందజేస్తామని వెల్లడించారు. అనంతరం మొదటి విడతలో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను
సన్మానించారు.

