ఖానాపూర్, వెలుగు: స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మ హిళలకు బ్యాంక్ లింకేజీ రుణాల కింద రూ.13,22,827 లక్షల విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళ సంఘాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
ఖానాపూర్ మండలం మస్కాపూర్ లోని కేజీబీవీ ఆవరణలో నిర్మిస్తున్న రూ.55 లక్షలతో నిర్మిస్తున్న అదనపు గదుల పనులు, ఖానాపూర్ లోని బాలుర ఆశ్రమ స్కూల్లో రూ.20 లక్షలతో నిర్మి స్తున్న డార్మెంటరీ గది పనులకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. రూ.55 లక్షలతో అదనపు గదులను నిర్మిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ టికెట్స్ రానివారు నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి భవిష్యత్లో అవకాశాలు ఉంటాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు చిన్నం సత్యం, అంకం రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
