జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. సర్కులర్ జారీ చేసిన ప్రభుత్వం

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. సర్కులర్ జారీ చేసిన ప్రభుత్వం

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సర్కులర్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని అధికారిక ఆదేశాలు జారీ చేశారు సిఎస్ శాంతకుమారి.  ఎలక్షన్ కమిషన్ అనుమతితో వేడుకలు నిర్వహిస్తున్నట్లు సర్కులర్ లో సీఎస్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్స్, చైర్పర్సన్ డిసిసిబి, మున్సిపల్ చైర్మన్లు, ఆయా కార్యాలయాల్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.  

జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ నిర్వహించాలని చెప్పారు. ఇక, ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ జరగనుంది.  అన్ని జిల్లా కార్యాలయాలు, శాఖల కార్యాలయాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.