
- ప్రజల కోసమే సర్కార్ పనిచేస్తున్నది: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరి ష్కార వేదికగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యం గాంధీ భవన్ నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగ ళవారం గాంధీ భవన్‌లో జరిగిన ‘అందుబాటులో ప్రజా ప్రతినిధులు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యల ఫిర్యాదుల్లో కొన్నింటికి అక్క డికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నిత్యం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి బీసీ అంశంలో పేరు వస్తుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీసీల జపం చేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్.. బీజేపీ పక్షాన ఉంటుందో.. లేక కాంగ్రెస్ తరఫున ఉంటుందో తేల్చుకోవాలన్నారు.