
ఆ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు: హరీశ్‌రావు
ఆరేండ్లలో ఎంతో చేశాం అందుకే టీఆర్ఎస్లోకి క్యూ
సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, భవిష్యత్తులో కూడా రాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. అసలు ఆ పార్టీపై జనం విశ్వాసం కోల్పోయారన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. 70 ఏండ్లలో జరగని డెవలప్మెంట్ను టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో చేసి చూపించిందని చెప్పారు. . టీఆర్ఎస్తోనే గుణాత్మక మార్పు వచ్చిందని.. అందుకే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్, సంక్షేమం కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ ఊర్లో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, ప్రతినెలా ఊర్లకు నిధులిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని హరీశ్ చెప్పారు.