హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులపై ఎండీ సర్ఫరాజ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులపై ఎండీ సర్ఫరాజ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ మెట్రో నూతన ఎండీగా నియమితులైన సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శనివారం ( సెప్టెంబర్ 20 ) మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులు మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టుకు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నడుస్తున్న ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ విస్తరణ పనులు జరుగుతున్న తీరుతెన్నులను సమీక్షించారు ఎండ్ సర్ఫరాజ్.

ఓల్డ్ సిటీలో పనులు వేగవంతం చేయాలని, సవాళ్ళను అధిగమించడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు ఎండ్ సర్ఫరాజ్. మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ తాజా పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ ను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ మార్గదర్శనంలో అనేక పనులు చేపట్టామని, వాటిని విజయవంతంగా పూర్తి చేయడంలో అధికారులు కృషి చేయాలని సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు.