కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన స్మృతి మందనా.. భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‎గా ఘనత

కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన స్మృతి మందనా.. భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‎గా ఘనత

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనా అరుదైన రికార్డ్ సృష్టించింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఫాసెస్ట్ సెంచరీ (50 బంతులు) చేసిన తొలి బ్యాటర్‎గా రికార్డ్ క్రియేట్ చేసింది. భారత వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డ్ ఇప్పటివరకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 2013లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో సెంచరీ చేశాడు. 2025, సెప్టెంబర్ 20న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం‎ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసింది స్మృతి మందనా. 

ఈ మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మృతి ఆస్ట్రేలియా బౌలర్లను ఊతికారేస్తూ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించింది. తద్వారా కోహ్లీ రికార్డ్‎ను బ్రేక్ చేస్తూ టీమిండియా తరుఫున వన్డే క్రికెట్లో ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‎గా అరుదైన ఘనత తన పేరిట లిఖించుకుంది స్మృతి మందనా. కోహ్లీ, స్మృతి మందనా ఇద్దరూ పటిష్టమైన ఆస్ట్రేలియాపైనే రికార్డ్ సెంచరీలు సాధించడం గమనార్హం. 

ఈ మ్యాచ్‎లో మందనా మరో రికార్డ్ కూడా నెలకొల్పింది. 50 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న స్మృతి మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‎గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెగ్ లానింగ్ 45 బంతుల్లో సెంచరీ చేసి మహిళా వన్డే క్రికెట్‎లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఇక, శనివారం (సెప్టెంబర్ 20) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 63 బంతులు ఎదుర్కొన్న స్మృతి 125 పరుగులు చేసింది. ఇందులో 17 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. తన ఇన్సింగ్స్ లో కేవలం బౌండరీల ద్వారానే స్మృతి 98 పరుగులు రాబట్టడం విశేషం.