LB స్టేడియంలో OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్ ఏంటంటే..

LB స్టేడియంలో OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్ ఏంటంటే..

హైదరాబాద్: హైదరాబాద్లోని LB స్టేడియంలో ఆదివారం సాయంత్రం OG మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్ జరగనుంది. ఈ కారణంగా.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్  హీరోగా సుజీత్ డైరెక్షన్‌‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్  ‘ఓజీ’. సెప్టెంబర్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా ఈ సినిమా విడుదల కానుంది. తెలంగాణలో OG ప్రీమియర్ షో సెప్టెంబర్ 24 రాత్రికే ప్రదర్శితం కానుంది. OG డైరెక్టర్ సుజీత్, ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సాహో’ సినిమాకు తెలుగులో అంత పాజిటివ్ వైబ్ రాకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.

సుజీత్ స్వతహాగా పవన్ కల్యాణ్ వీరాభిమాని కావడంతో OG సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను మరిం పెంచుతూ థమన్ సాంగ్స్, బీజీఎం.. OG గ్లింప్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. హరిహరవీరమల్లు సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఈ They Call Him OG సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. 

ఈ సినిమాతో పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని డిసైడ్ అయిపోయారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్, వెబ్ సైట్స్ లో ఇప్పటికే OG సినిమా అడ్వాన్స్ బుకింగ్స్కు మంచి స్పందనే దక్కింది. ఈ సినిమా టికెట్లు హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి. సెప్టెంబర్ 21న ఆదివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల కానున్న OG ట్రైలర్తో ఈ సినిమాకు మరింత హైప్ దక్కే ఛాన్స్ ఉంది.