Asia Cup 2025: ACC ప్లాన్ వర్కౌటైంది.. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ చేశారా..

Asia Cup 2025: ACC ప్లాన్ వర్కౌటైంది.. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ చేశారా..

ఆసియా కప్ లో మరో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సూపర్-4 లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ వేదికగా మరోసారి దాయాదుల మధ్య సమరం జరగనుంది. గ్రూప్-బి లో ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 కు చేరుకున్నాయి. టోర్నీలో తిరుగులేకుండా ఆడుతున్న టీమిండియా ఈ మ్యాచ్ లో క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. సూపర్-4 లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు. బలహీనమైన పాకిస్థాన్ పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపించాలని చూస్తుంటే.. ఈ సారి ఎలాగైనా ఇండియాకు షాక్ ఇవ్వాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది.  

ముందుగానే ACC ప్లాన్:
         
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 కు చేర్చి వీరిద్దరి మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహించాలనే ప్లాన్ కుదిరింది. ఇండో-పాక్ మ్యాచ్ కోసమే పక్కా ప్లాన్ చేసి షెడ్యూల్ ను పకడ్బందీగా ప్లాన్ చేరినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఉంచడమే కాదు గ్రూప్-ఏ లో బలహీనమైన జట్లను ఉంచారు. ఒమన్, యూఏఈ జట్లకు పాకిస్థాన్, ఇండియాలను ఓడించే సత్తా లేదు. దీంతో ఊహించినట్టుగానే ఇండియా, పాకిస్థాన్ జట్లు సూపర్-4 కు చేరుకున్నాయి. షెడ్యూల్ లో కూడా గ్రూప్-ఏ లోని రెండు జట్లు ఆదివారం (సెప్టెంబర్ 21) సూపర్-4 మ్యాచ్ ఆడేలా ప్లాన్ చేయడం విశేషం. మరోసారి ఆసియా కప్ లో జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

లీగ్ మ్యాచ్ లో ఇండియా ధాటికి పాక్ చిత్తు:
 
ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. బౌలింగ్‎లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‎లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47) రాణించడంతో పాకిస్థాన్‎పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.