ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశామని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని విమర్శించారు.  ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని  వసతులు, వనరుల వాడుకునే నైపుణ్యం కల్పించట్లేదని ఆరోపించారు.  కాంగ్రెస్ వచ్చాక అన్నీ మాయమయ్యాయని పవర్ లోకి కాంగ్రెస్ ఆగమాగం చేసిందని అన్నారు. పదేండ్ల కింద ఉన్న ఇబ్బందులే మళ్లీ వచ్చాయని తెలిపారు. చేవెళ్లలో నిర్వహించిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణాలో అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలని సూచించారు. ప్రభుత్వం అంటే ప్రజల్లో ఆత్మ విశ్వసం ఉండాలని ఓటు వేసేముందు జాగ్రత్తగా ఆలోచించండని కోరారు.   రేపు అంబేద్కర్ జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర స‌మాజం ప‌క్షాన‌, మ‌న ప‌క్షాన అంబేద్కర్‌కు హృద‌య‌పూర్వక‌మైన నివాళుల‌ర్పిస్తున్నానని తెలిపారు. 

ఈ దేశంలోనే ఎక్కడ లేనంత సమున్నత గౌర‌వం అంబేద్కర్‌కు ఇవ్వాల‌ని రెండు ప‌నులు చేశామన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెల‌కొల్పి దేశానికే స‌మున్నత‌ గౌర‌వం వ‌చ్చేలా చేశామని కొత్తగా నిర్మించిన స‌చివాల‌యానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని తెలిపారు. 75 ఏండ్లలో ఇలాంటి ప‌ని ఎవ‌రూ చేయ‌లేదని  ఇలా ఆ హానీయుడికి నివాళుల‌ర్పించామ‌ని కేసీఆర్ తెలిపారు.