మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్

మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్

వేములవాడ/వేములవాడ రూరల్/చందుర్తి, వెలుగు: మహిళల ఆర్థిక అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే​ఆది శ్రీనివాస్​అన్నారు. వేములవాడ, చందుర్తి మండలాలకు చెందిన రుద్రవరం, నూకలమర్రి, చందుర్తి, మల్యాలలో ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌‌‌‌తో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చందుర్తి మండలాన్ని ఎన్నడూ మరవనన్నారు. జిల్లాలో 1.45 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.