పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో..రైల్వే అండర్బ్రిడ్జిలపై కవర్షెడ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలి : అనుమాస శ్రీనివాస్

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో..రైల్వే అండర్బ్రిడ్జిలపై కవర్షెడ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలి : అనుమాస శ్రీనివాస్
  • దక్షిణ మధ్య రైల్వే యూజర్స్​కమిటీ మెంబర్​అనుమాస శ్రీనివాస్​ 

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండం, ఓదెల, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఉన్న రైల్వే అండర్​ బ్రిడ్జిలపై కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షెడ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్​కమిటీ మెంబర్​అనుమాస శ్రీనివాస్​ రైల్వే అసిస్టెంట్​ డివిజన్​ఇంజినీర్​సుశాంత్​కుమార్​శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. 

గురువారం రామగుండంలో ఆయనను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జిలపై కవర్​షెడ్​లేకపోవడం వల్ల అండర్​ బ్రిడ్జిల వద్ద నీరు నిల్వ ఉండి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అండర్​బ్రిడ్జిలపై షెడ్ కవర్ ఏర్పాటు చేయాలని కోరారు.