మహబూబ్ నగర్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణపేట ఎస్పీ వినీత్ కోరారు. శుక్రవారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్తా భారత్ అభియాన్లో హాజరై మాట్లాడారు. డ్రగ్స్ కు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఎవరైనా గంజాయి, డ్రగ్స్ రవాణా, అమ్మినట్లు గుర్తిస్తే 1908 టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. పీయూ ప్రొఫెసర్ రాజశేఖర్ , సీఐ శివశంకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, సునీత, భజరంగ్ దళ్ ప్రెసిడెంట్ వడ్ల శ్రవణ్, సెక్రటరీ కన్న శివకుమార్, నగర అధ్యక్షుడు మురళీ , నరేశ్, వెంకటరమణ, వెంకటేశ్ పాల్గొన్నారు. అనంతరం ఆపరేషన్ చబుత్రాలో పట్టుబడిన 56 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
