వలస కూలీలను కాంగ్రెస్సే ఆదుకుంది.. ఇదే నిజం

వలస కూలీలను కాంగ్రెస్సే ఆదుకుంది.. ఇదే నిజం

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్‌‌లో వలస కూలీలను కాంగ్రెస్ మాత్రమే ఆదుకుందని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాక్‌‌డౌన్‌‌‌లో మైగ్రంట్ వర్కర్స్ కష్టాల గురించి రాహుల్ ట్వీట్ చేశారు. వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర సర్కార్‌‌తోపాటు బిహార్ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ మండిపడ్డారు. ‘లక్షలాది వలస సోదరులు, సోదరీమణులు ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌‌లోని తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఒత్తిళ్లు ఎక్కువైన సమయంలో మోడీ, నితీశ్ కుమార్ ప్రభుత్వాలు వారిపై దారుణంగా ప్రవర్తించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అయినా ఈ దారుణం, అమానుషానికి వ్యతిరేకంగా వలస కూలీలకు అండగా నిలుస్తూ భరోసా ఇచ్చాం. ఇదే నిజం’ అని రాహుల్ ట్వీట్ చేశారు. లాక్‌‌‌డౌన్ టైమ్‌‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మైగ్రంట్ వర్కర్స్‌‌కు అందించిన సాయాన్ని రాహుల్ గుర్తు చేశారు. లాక్‌‌డౌన్‌‌లో వలస కూలీలు వందలాది మైళ్లు నడుస్తూ వెళ్లడం, తమ బాధను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి ఘటనలతో కూడిన ఒక వీడియోను ట్వీట్‌‌కు రాహుల్ జత చేశారు.