ఒక్కో గెస్ట్​కు ఒక్కో ప్రొటోకాల్​ ఆఫీసర్..CWC సమావేశాలపై AICC గైడ్​లైన్స్​ రిలీజ్

ఒక్కో గెస్ట్​కు ఒక్కో ప్రొటోకాల్​ ఆఫీసర్..CWC సమావేశాలపై AICC గైడ్​లైన్స్​ రిలీజ్
  • హోటల్స్, ఎయిర్​ పోర్ట్​ కో ఆర్డినేషన్​ చూడనున్న ఏఐసీసీ సెక్రటరీలు
  • అతిథుల ట్రావెల్​ ప్లాన్​ కోసం కంట్రోల్​ రూం.. తొలి రోజు మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్​

హైదరాబాద్​, వెలుగు: సీడబ్ల్యూసీ సమావేశాలపై కాం గ్రెస్​ హైకమాండ్​ షెడ్యూల్, గైడ్​లైన్స్​ విడుదల చేసింది. సమావేశాలకు హాజరయ్యే ఒక్కో అతిథికి ఒక్కో ప్రొటోకాల్​ ఆఫీసర్​ను నియమించింది. కార్యక్రమాలకు సంబంధించిన కో ఆర్డినేషన్​ను ఆ ప్రొటోకాల్​ ఆఫీసరే చూసుకోనున్నారు. స్థానికంగా కో ఆర్డినేషన్​ కోసం ఏఐ సీసీ ఇన్​చార్జి సెక్రటరీలతో మాట్లాడాల్సిందిగా గెస్ట్​లకు సూచనలు చేసింది. హోటల్​ అకామిడేషన్​ కోసం పీసీ విష్ణునాథ్, రోహిత్​ చౌదరి, ఎయిర్​పోర్ట్​ కో ఆర్డినేషన్​ బాధ్యతలను మన్సూర్​ అలీఖాన్​కు అప్పగించింది.

సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుందని తెలిపింది. సీడబ్ల్యూసీ సభ్యులు, సీఎంలు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల కల్లా హైదరాబాద్​కు చేరుకోవాలని పేర్కొంది. తర్వాతి రోజు జరిగే మీటింగ్​కు సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ సభ్యులు, సీఎల్పీ నేతలు, పీసీసీ చీఫ్​లు, ఆఫీస్​ బేరర్లు శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం కల్లా హైదరాబాద్​కు చేరుకోవాలని తెలిపింది. ఆదివారం సభ పూర్తయ్యాక పీసీసీలు, సీఎల్పీ నేతలు, ఆఫీస్​ బేరర్లు వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లిపోవాలని వెల్లడించింది. రాత్రి బస నియోజకవర్గాల్లోనే చేయాలని పేర్కొంది. కాగా, సీడబ్ల్యూసీ మీటింగ్​కు హాజరయ్యే గెస్టుల ట్రావెల్​ ప్లాన్​ కోసం ఏఐసీసీ కంట్రోల్​ రూంను ఏర్పాటు చేసింది. వివరాలను వాట్సాప్​ లేదా మెయిల్​ ద్వారా పంపించాలని సూచనలు చేసింది.