కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. వెంకట్ రెడ్డి 10 రోజుల్లో  వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఆడియో లీకేజీపై మాణిక్కం ఠాగూర్ ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలంటూ.. వెంకట్ రెడ్డి చెప్పినట్లు ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్లో దుమారం లేచింది. 

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా టూర్ లోనూ వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను ప్రచారం చేస్తే ఓట్లు పెరుగుతాయి తప్పితే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలవరని చెప్పడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మునుగోడు బై పోల్ హీట్ కొనసాగుతోన్న సమయంలో కాంగ్రెస్ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  మునుగోడు ఉప ఎన్నిక పూర్తైన తర్వాతే భారత్కు తిరిగిరానున్నట్లు సమాచారం.