పాట్నాలో CWC మీటింగ్ స్టార్ట్.. బీహార్ ఎన్నికలు, ఓట్ చోరీపై ప్రధాన చర్చ..!

పాట్నాలో CWC మీటింగ్ స్టార్ట్.. బీహార్ ఎన్నికలు, ఓట్ చోరీపై ప్రధాన చర్చ..!

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన బీహార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సదాకత్ ఆశ్రమంలో ఈ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కోశాధికారి అజయ్ మాకెన్, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. 

వీరితో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకులు అటెండ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలు, పొత్తులపై డిస్కస్ చేయడంతో పాటు ఓటు చోరీ విషయంలో బీజేపీపై దాడులను మరింత తీవ్రతరం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.