ఎన్నార్సీ, ఎన్‌‌‌‌పీఆర్ అమలు చేయం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల హామీ

ఎన్నార్సీ, ఎన్‌‌‌‌పీఆర్  అమలు చేయం.. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల హామీ

    సీఏఏను సుప్రీంలో సవాలు చేస్తాం

    ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన  కాంగ్రెస్

     నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ

తాము అధికారంలోకి వస్తే నేషనల్ ఎన్నార్సీ,ఎన్ పీ ఆర్​లను ఢిల్లీలో అమలు చేయబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపింది. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా “ఐసీ హోగీ హమారీ ఢిల్లీ” పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం రిలీజ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, రాజీవ్ గౌడ, శర్మిష్ఠ ముఖర్జీ పాల్గొన్నారు. యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు భృతి ఇస్తామని సుభాష్ చోప్రా చెప్పారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి నెలకు రూ.5 వేలు, పీజీ పూర్తి చేసినవారికి నెలకు రూ.7,500  నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ, ట్రాన్స్ పోర్టు సౌకర్యం మెరుగుపరుస్తామని చెప్పారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్

కన్జ్యూమర్లకు మేలు చేసేలా పవర్, వాటర్ సప్లయ్ బిల్లులపై క్యాష్ బ్యాక్ స్కీములు

రూ.15కే భోజనం అందించే వంద ఇందిరా క్యాంటీన్లు

సీనియర్ సిటిజన్లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఢిల్లీ మెట్రోలో మహిళలు, స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్ కు సబ్సిడీ

బాలికలకు ఉచిత విద్య, మహిళలకు ఫ్రీ హెల్త్ చెకప్

షీలా పెన్షన్ యోజన కింద సీనియర్ సిటిజన్లు,  దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు నెలకు రూ.5 వేల పెన్షన్

యారీ స్టార్టప్ ఇన్ క్యుబేషన్ ఫండ్ కింద ఎంటర్ ప్రెన్యూర్స్ కు రూ.5 వేల కోట్ల ఇన్సెంటివ్స్

తొలి ఎలక్ట్రిక్ వాహనాల సిటీగా ఢిల్లీ, 15వేల ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు

ఐదు లక్షల కుటుంబాలకు ఏడాదికి రూ.7,200 ఆర్థిక సాయం