ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి
సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో నేలకరిచింది. సీనియర్ లీడర్షీలాదీక్షిత్ హయాంలో పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన పార్టీ.. ఈ ఎన్నికల్లో కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి 67 చోట్ల పార్టీ కేండిడేట్లకు డిపాజిట్ కూడా దక్కలే.. గాంధీనగర్, బద్లీ, కస్తూర్బా నగర్లలో మాత్రమే కాంగ్రెస్ కేండిడేట్లు డిపాజిట్దక్కించుకున్నరు. టోటల్‌గా కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ఓటర్లు దూరంపెట్టారు. ఎన్నికల్లో తమకు ఘోర ఓటమి ఎదురైనప్పటికీ బీజేపీ కూడా ఓడిపోవడంతో కాంగ్రెస్ నేతలు పలువురు హ్యాపీగా ఫీలవుతున్నరు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నరు. కేజ్రీవాల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పార్టీని కిందిస్థాయి నుంచి సంస్కరించాల్సిన టైమొచ్చిందని పార్టీ సీనియర్ లీడర్లు అభిప్రాయపడ్డారు. కొత్త నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. పార్టీ ఓటమిపై బాధగా ఉన్నా.. బీజేపీ విషప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారంటూ వారు ఆనందం వ్యక్తంచేశారు.
డిపాజిట్ గల్లంతుఅంటే..
ఎన్నికల బరిలో ఉన్న కేండిడేట్‌కు ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం వ్యాలీడ్ ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు పడితే డిపాజిట్ దక్కిందని అంటారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఈసీ తిరిగిస్తుంది. 6 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చిన కేండిడేట్‌కు ఈసీ డిపాజిట్ తిరిగివ్వదు.
నిర్ణయాల్లో ఆలస్యం, యూనిటీ లేకే..
ఎన్నికల్లో పోటీకి సంబంధించి పార్టీకి సరైన స్ట్రాటజీ లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్లే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేషనల్ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ఢిల్లీ నేతల్లో యూనిటీ లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని అన్నారు.
