42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : బీసీ  ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ 

42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : బీసీ  ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ అమ లు చేసి తీరుతామని బీసీ ఫైనాన్స్ కార్పొరేష న్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కొంతమంది నేతలు బీసీ రిజర్వేషన్ల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు బీసీ రిజర్వేషన్లకు ఆ ప్రతిపక్ష నేతలకు ఏం సంబంధం అని మంగళవారం విడుదల చేసిన ఓ  ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత​ రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణ మోడల్ గురించి చెబుతూ ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.