అధికారం కోసం కాంగ్రెస్ పూటకో మాట చెబుతుంది : మోదీ

 అధికారం కోసం కాంగ్రెస్ పూటకో మాట చెబుతుంది  : మోదీ

కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేశారు ప్రధాని మోదీ. అధికారం కోసం కాంగ్రెస్ పూటకో మాట చెబుతుందని విమర్శించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంసకు మ‌రోవైపు మోదీ గ్యారంటీల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటమని తెలిపారు. ప్రజ‌లు ఏ ప‌క్షం వ‌హిస్తారో తేల్చుకోవాల‌ని సూచించారు. అధికారం కోసం కాంగ్రెస్ అస‌త్యాల‌ను ప్రచారం చేస్తోంద‌ని ఫైర్ అయ్యారు. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో జ‌రిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.అగ్ర కులాల్లోనూ పేద‌లు ఉంటార‌ని, వారికీ రిజ‌ర్వేష‌న్లు అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్‌కు 60 ఏండ్లుగా తెలియ‌లేద‌ని విమర్శించారు.  ఈ కులాల గురించి కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించ‌లేద‌ని, మోదీ వ‌చ్చిన త‌ర్వాతే అగ్రవ‌ర్ణాల్లోని పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించార‌ని చెప్పారు. 

హిమాచ‌ల్ ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వ‌స్తే తొలి క్యాబినెట్‌లోనే ఇది జ‌రుగుతుంది..అది జ‌రుగుతుంద‌ని క‌బుర్లు చెప్పార‌ని కానీ ఏం జ‌ర‌గ‌లేద‌ని, మంత్రివ‌ర్గమే ధ్వంస‌మైంద‌ని విమర్శించారు.