
కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ అని మంత్రి సీతక్క అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం, ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుందని చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పించేందుకు నోటిఫికేషన్స్ వేస్తున్నామని సీతక్క చెప్పారు. జీఓ 3 ఉద్యోగాలకు సంబంధించింది గత ప్రభుత్వం హయాంలోనే జారీ చేశారని తెలిపారు. ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు మహిళలకు అగ్రభాగాన నిలుపుతుమని సీతక్క తెలిపారు.