కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం : అమిత్ షా

కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం : అమిత్ షా

గిరిజన హోదా కోసం 55 ఏండ్లుగా హాతి వర్గం చేస్తున్న పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు పలికారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన... సిర్మౌర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాంగ్రెస్ పని అయితే.. రాష్ట్రాలను అభివృద్ధి చేయడం బీజేపీ పని అన్నారు. హిమాచల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పరివార్ వాదాన్ని అంతం చేశామని  షా అన్నారు. అధికార కాంక్షతో మన వారసత్వాన్ని కాంగ్రెస్ గౌరవించలేకపోయిందని విమర్శించారు. 

హిమాచల్ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ 44 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లు మాత్రమే సాధించింది.